జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలు

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు , పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీ విశ్వకర్మ జయంతిని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు, ఇంజినీరింగ్ రంగం, ఆర్కిటెక్చర్ రంగం వాళ్లు మాత్రమే కాకుండా వివిధ రకాల చేతివృత్తుల వారు, హస్తకళాకారులు, మెకానికులు, వెల్డర్లు, పారిశ్రామిక కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు మొదలైన వారు కూడా జరుపుకుంటారని ఆయన వివరించారు.

మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఒక శిల్పి, ఒక వృత్తి నిపుణుడి కృషి దాగి ఉంటుందని, సమాజంలో పలు రకాల వృత్తుల వారు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. శారీరక శ్రమకు, చేతి పనికి విలువ ఇవ్వడం ఎంత అవసరమో విశ్వకర్మ జయంతి మనకు గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తిని, శ్రమను గౌరవించుకోవాలని సూచించారు.

ఈ ఆధునిక యుగంలో ఆయన సిద్ధాంతాలు, సృజనాత్మకత, కష్టపడే తత్వం, పట్టుదల మరియు నైపుణ్యాన్ని అలవరచుకుంటే ఎంత కష్టమైన పనినైనా తేలికగా సాధించవచ్చని తెలియజేస్తూ, విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అదనపు ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామిరెడ్డి, ఎఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *