తల్లి ఆరోగ్యంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావించి స్వస్త్ నారీ స శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రారంభించారు. పీహెచ్సీ వైద్యాధికారి టి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచి మేకల చార్లేన్ సర్జన్ ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉంటే ఆ నివాసం చక్కగా ఉంటుందని ముందుగా మహిళలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలనే ఆలోచనలకు వక్తలు ధన్యవాదాలు చెప్పారు. వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్యులు రాజేష్, హెూమియో వైద్యురాలు శిరీష, ఐసీడీన్ నూపర్వైజర్ ఇందిరలు మాట్లాడుతూ ప్రతి మహిళా తమ ఆరోగ్యాన్ని లెక్కచేయక ఇంటి కోసం తమ పిల్లల కోసం ఎంతో శ్రమిస్తారని, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో తమ ఆరోగ్యాన్ని పరిక్షించుకుని తగిన వైద్యం పొంది మరింత మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలని కోరారు. పలు విభాగాలుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఐడీడీఎన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం ప్రదర్శను నిర్వహించారు. అనస్తీషియా వైద్యులు డాక్టర్ షయామ్, సీహెచ్ఎ ఎవీ రమణమ్మ, హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్ పీహెచ్ఎన్ వై విజయమ్మ, హెచ్పీ మాలతి, ఆఫ్తాలమిస్ట్ ఉమా, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీ టీచర్లు, కస్తూరిబా విద్యార్థులు పాల్గొన్నారు.





తూర్పుగంగవరంలో … ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త నారీ నశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ సానికొమ్ము సత్యం, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య ముఖ్య అతిథిలు గా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీమకుర్తి సీహెచ్సీ సూపరిండెంట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గైనకాలజిస్ట్ శ్వేత అతిథి డాక్టర్లుగా పాల్గొని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి లతో కలసి 358 మందిని పరీక్షించి అవసరమైన ముందులు అందించారు. సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య 20 గర్బిణీ స్త్రీలకు పండ్లు దాతృత్వంతో అందించారు. డిప్యూటీ ఎంపీడీఓ మల్లేశ్వరి, హెచ్ఐఓ చంద్ర శేఖర్ బాబు, రామిరెడ్డి, శ్రీను, షేక్ మీరామోహిద్దీన్, సుబ్బా రావు, ఎన్ పుల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

