తాళ్లూరు మండలంలో నాడు – నేడు పధకంలో గత ప్రభుత్వ హయాంలో ఆనేక పాఠశాలను
సుందరంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం నిమిత్తం వాటర్ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేసారు. అయితే నాడు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్స్‌లో ఏవైనా లోపాలు వస్తే నాడు – నేడు యాప్‌లో నమోదు చేస్తే సంబంధిత సిబ్బంది వచ్చి మరమ్మత్తులు చేసి వెళ్లే వారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అటువంటి వ్యవస్థ ఎదీ లేక పోవటంతో మండలంలోని పలు చోట్ల వాటర్ ప్లాంట్స్ మూలన పడ్డాయి. బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు. అయితే బొద్దికూరపాడు ప్రాధమిక పాఠశాల (ఎన్సీ విఆర్ )లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మాత్రం గత నాలుగేళ్లుగా బాగా పనిచేసినది. అయితే గత రెండు రోజుల కిత్రం మరమ్మత్తులకు గురయినది. కావున ప్రభుత్వ ప్రాధమిక, హైస్కూల్స్ లోరూ. లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను తిరిగి ఉపయోగంలోనికి తీసుకువచ్చేలా ఉన్నతాధికారులు, కూటమి నాయకులు దృష్టి సారించాలని ఎపీటీఎఫ్ తాళ్లూరు మండల గౌరవ అధ్యక్షులు నంగు రవీంద్రా రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండూరి నాగ రాజు, నారి పెద్ది శ్రీనివాస రావు, జిల్లా కౌల్సిల్ పోలం రెడ్డి నుబ్బా రెడ్డిలు ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్
తాళ్లూరు మండల శాఖ కోరుతున్నారు.

