తాళ్లూరు మండలం లోని పంచాయితీలకు ఆదాయ వనరు చేకూర్చుకోవటంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ రజిత అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నమావేశపు మందిరంలో శుక్రవారం ఓన్ సోర్స్ రెవిన్యూ (ఒఆర్ ఎన్) పై రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. పంచాయితీలలో ప్రధాన ఆర్థిక వనరులను గుర్తించి తగిన ఆదాయాన్ని జమచేసి పంచాయితీలలో చెయ్యవలసిన అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలపై చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. డిప్యూటీ ఎంపీడీఓ నాగ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

