దర్శి ఎమ్మెల్యే ,ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు దర్శి లో నకిలీ మద్యం తో ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు దర్శి ఎక్సైజ్ ఆఫీసు వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సి ఐ కి వినతి పత్రం అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం వాచక నకిలీ మద్యం ఏరులై పారుతుంది అని స్వయాన టీడీపీ తంబళ్లపల్లె ఇంచార్జి నకిలీ మద్యం తయారీ లో ముఖ్య పాత్ర పోషించాడు అంటే ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేది అర్థం అవుతుంది అన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు కె.వి.రెడ్డి మాట్లాడుతూ నకిలీ మద్యం వల్ల ఇప్పటికే రాష్ట్రం లో 5 మంది మృతి చెందారు అని అన్నారు.ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి అని అన్నారు.రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడికొండ జయంతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లో వచ్చాక నకిలీ మద్యం ఏరులై పారుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి ,ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస రెడ్డి ,దర్శి పట్టణ అధ్యక్షులు ముత్తినీడి సాంబ ,కురిచేడు జడ్పిటీసీ నుసుం నాగిరెడ్డి ,ముండ్లమూరు జడ్పీటీసీ రత్నరాజు , కోరే సుబ్బారావు ,నలదిమ్ము రమణా రెడ్డి , మజున్ వలి ,అన్నవరపు రవి ,రవీంద్రా రెడ్డి ,మెడగం బాలకృష్ణ రెడ్డి ,రాష్ట్ర విద్యార్థి విభాగం జోనల్ ఇంచార్జి దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
