అంతర్జాతీయ బాలికల దినోత్సవంను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాలికల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పి రాజా బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ బాలికలు చిన్న తనం నుండే జీవితం పట్ల క్రమశిక్షణతో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని సాధనకు కృషి చెయ్యాలని కోరారు. ఆర్ధిక ఇబ్బందుల వలన తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రొత్సహిస్తే అధికారులకు తెలియజెయ్యాలని సూచించారు. కెజీ బివి, గురుకుల, స్వచ్చంద సంస్థల ద్వారా ఉచిత విద్యను అందిస్తున్నట్లు సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఆయా పాఠశాలలో ముందుగా బాలికల దినోత్సవం ను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసారు. చైల్డ్ హెల్ప్ లైనోపోస్టర్ ను ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

