చిత్తూరు జిల్లా పలమనేరు నుండి విజయవాడకు వెళ్తున్న టెంపో ట్రావెల్ మినీ బస్సు నంబర్ ఎపీ 39 విబి 2534 సోమవారం తెల్లవారుజామున 3. 10 గంటలకు రైస్
కళాశాల దాటిన తర్వాత డివైడర్ ను ఢీ కొట్టి ప్రక్కన ఉన్న గోతిలో పడినది. తెల్ల వారు జామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 19 మంది తో పాటు పలువురు గాయపడగా, ఒకరు మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాలతో అప్రమత్తమై ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాస రావు, టౌన్సీఐ ఎం శ్రీనివాస రావు, టంగుటూరు ఎస్సై నాగ మల్లేశ్వర రావు హైవే ఫైర్ సిబ్బందితో కలసి కాలువలో పడ్డ బస్సును బయటకు తీసి గాయాల పాలైన ప్రయాణిలను ఒంగోలు రిమ్స తరలించారు. ప్రమాదంలో మిని బస్సులో ప్రమాణిస్తున్న చిత్తూరు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన ఎనర్జీ అసిస్టెంట్ కామాటం చరణ్ కుమార్ (35) మృతి చెందాడు. అతినికి భార్య ప్రీతి, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉన్నారు.
పలువురుకి గాయాలు …
డ్రైవర్ కుషిని వినోద్ తో పాటు ఎస్ బాలసుబ్రమణ్యం, బొమ్మన పల్లి బాల క్రిష్ణ, రవ్వల రాజేష్, తిమిదేల పాటి దినేష్, నంగిలి మహేష్, వలిగల్ల ప్రసాద్, సోహేల్ విరాజీ గౌరీ శంకర్, గుండ్ల కట్ట మంచి పృద్వి, ఖాదర్ బాష, సికిందర్, అకుబోతు శ్రీనివాస్, నాయక్, సూరేపల్లి, రామ్మోహన్ బాబు, ఎన్ కె సురేంద్ర నాయడు, గాటి మురుగేష్, ఆర్ ఎం హరి కుమార్, సి అనిల్ కుమార్, మొగనపల్లి మురళి, నర్రా కుపేంద్రుడు లు ఉన్నారు.
సకాలంలో స్పందించిన పోలీసులు …
పోలీసులు సకాలంలో స్పందించకుంటే ప్రాణ నష్టం మరింత పెరిగేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల సేవలకు క్షత గాత్రులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు డీఎస్సీ రాయపాటి శ్రీనివాస రావు మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. బాధితుల కుటుంబాలతో కూడ మాట్లాడామని ఎలాంటి ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు.

