సికింద్రాబాద్ అక్టోబర్ 17(జే ఎస్ డి ఎం న్యూస్) :
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి గత జూలై మాసం నుండి సంబంధిత కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలుగా గాంధీ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని అది తక్కువ జీతాలతోపనిచేయుచున్నటువంటి ఈ నర్సింగ్ సిబ్బందికి మూడు నెలలు పూర్తి నాలుగో నెల గడుస్తున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదని వారు తెలియజేశారు.
కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడంలో విఫలం చెందితే ముఖ్య యజమానిగా ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్ చట్టం సూచిస్తున్నదని వారు వివరించారు.పండగల సందర్భంగా కూడా ఉద్యోగులకు జీతాలు లేక వస్తువులు ఉండే దుస్థితి కొనసాగుతున్నదని తక్షణం కాంట్రాక్టర్లతో మాట్లాడి జీతాలు ఇప్పించకపోతే అందులో నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు.
కాంట్రాక్టర్లు ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించే విధంగా చూడాలని కాంట్రాక్టర్లను కనీసం రెండు సంవత్సరాలు ఉండే విధంగా కాంట్రాక్టు అగ్రిమెంట్లు చేసుకోవాలని వారు సూపరిండెంట్ కు వివరించారు.ప్రతి సంవత్సరం కాంట్రాక్టర్లు మారడం వలన ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని అదేవిధంగా ఎక్కువమంది కాంట్రాక్టర్లకు నియమించడం వలన ఉద్యోగులకు ఇబ్బందులుఎదురవుతున్నాయని వారికి తెలియజేశారు.
అనంతరం సూపరిండెంట్ సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి రేపటి లోపు అందరికీ జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని యూనియన్ ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు డి సుందరమ్మ, ఎం నాగమణి, ఈ అనిత, బి పుణ్యమ్మ, ఎల్ శోభారాణి, ఎస్ లక్ష్మి, ఏ ప్రబలత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు .
