వరల్డ్ స్పైన్ – ట్రామా డే సందర్భంగా ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో 5కె వాక్.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్పైన్ డే మరియు వరల్డ్ ట్రామా డే సందర్భాలనుపురస్కరించుకుని అవగాహన కల్పించేందుకు 5కె వాక్ నిర్వహించారు. ప్రజలకు, ముఖ్యంగా బీద మరియు మధ్యతరగతి వర్గాలకు ఆధునిక వైద్యసేవలను సమానంగా అందించాలనే లక్ష్యంతో ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఈ వాక్‌ను శుక్రవారం ఉదయం నాంపల్లి చాపల్ రోడ్‌లోని ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభించింది.వాక్‌ను ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ్ దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 శాతం మంది వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. రోడ్ల పరిస్థితి సరిగా లేకపోవడం, డయాబెటీస్, ఊబకాయం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఈ సమస్యలుపెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చోవడం, అలాగే మొబైల్ ఫోన్ వినియోగం అధికం కావడం వల్ల కూడా వెన్నెముక సమస్యలు విస్తరిస్తున్నాయని వివరించారు.ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం, యోగా, స్విమ్మింగ్, వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఉదయ్ ప్రకాష్, సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీరంగ్ ఆబ్కారి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే ఒబేసిటీ, వెన్నెముక సమస్యలుపెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఈ వాక్‌ను చేపట్టిందని తెలిపారు.ఈ వాక్‌లో ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ యూనిట్ హెడ్ ఎం. రాజ్‌కుమార్, డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ కృష్ణ నారాయణతో పాటు ఇతర వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *