ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బద్రి సుభాషిణి కి ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ విభాగంలో పీహెచ్ డి ( డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ) పట్టా పొందారు. హిందీ సాహిత్యంలో సమకాలీన హిందీ కవి శ్రీ కేదార్నాథ్ అగర్వాల్ కావ్యాలలో జీవన విలువలు అనే అంశంపై పరిశోధన చేసి 16 అక్టోబర్ 2025 వ తేదీన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పీహెచ్ డి పట్టా పొందారు. ఏపీటీఎఫ్ శాఖ తరపున ఆమెకు అభినందనలు తెలిపారు.
