ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న ఒంగోలు ఎకే వికే డిగ్రీ కళాశాలలో మోగా జాబ్ మేళ నిర్వహించనున్నారు. ఈ మేళా పోస్టర్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ శనివారం విడుదల చేసారు. బహుళ జాతి కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, రూ. 11 వేల నుండి 35వేల వరకు జీతాలు, ప్రొత్సాహకాలు ఇస్తాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ డీఎస్ డీ ఓ జె రవి తేజ వివరించారు. పూర్తి వివరాలకు 9573798594, 7842004344 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
