జంగమ కుల వృత్తి పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇవ్వాలని వక్తలు అన్నారు. ఒంగోలు టిడిపి కళ్యాణ మండపంలో ఆదివారం జంగమ సంక్షేమ సంఘం, అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు నిర్వహించారు. ఒంగోలు జంగమ సంఘం అధ్యక్షులు దంపూరి సాయి రామ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ముసునూరి కోటేశ్వర రావు, పరవళ్ల రాచయ్య, గౌరవ సలహాదారుడు దోగిపర్తి సుబ్బా రావు పాల్గొని జంగమ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎంతో చేయూత ఇవ్వాల్సిన అవశ్యకతను వివరించారు. జంగమ కుల వృత్తి భారతీయ సనాతన జీవన విధానానికి, హిందూ సంస్కృతి సాంప్రదాయా పరిరక్షణకు చేస్తున్న కృషిని తెలిపారు. జంగమ కుల వృత్తి దారులకు గౌరవ వేతనం రూ. 10వేలతో పాటు శ్రీశైలం, కాలహస్తి పుణ్యక్షేత్రాలలో పాలక మండలిలో సభ్యత్వం కల్పించాలని విన్నవించారు. కార్పోరేషన్లో జిల్లా వాసులకు స్థానం కల్పించాలని కోరారు. ముందుగా నందీశ్వరుని, లింగమూర్తిని నగరోత్సవం నిర్వహించారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుతులు అందించారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారు నాగండ్ల సుబ్రహ్మణ్యం, సురేష్, ఉద్దండం వీరా సాయి బాబ, యల్లసిరి మల్లిఖార్జున్, అమర్ నాథ్, చేజర్ల శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

