‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో రానున్న మూడు రోజులు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా తగు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరి మరియు మొంథా తుఫాన్ ప్రత్యేక అధికారి కోన శశిధర్,
అధికారులను ఆదేశించారు.
ఆదివారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మొంథా తుఫాన్ నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు చర్యలు పై ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలసి అధికారులతో సమావేశమై, శాఖల వారీగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో రానున్న మూడు రోజులు 27,28,29 తేదీల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు పటిష్టంగా చేపట్టాలన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్ మీడియా తో మాట్లాడుతూ, ‘మొంథా’ తుపాను ముప్పు ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్దంగా ఉందన్నారు. ‘మొంథా’ తుపాను నేపధ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి ఈ రోజు ఒంగోలుకు రావడం జరిగిందన్నారు. తుఫాన్ నేపధ్యంలో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలసి ఆల్ కీ డిపార్ట్మెంట్స్ అధికారులతో సమీక్షించి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ ‘మొంథా’ తుపాను 28వ తేదీ రాత్రి మచిలీపట్నం – కాకినాడ మద్యన తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా అని తెలిపారు. మత్స్యకారులు ఎవరైనా చేపల వేటకు సముద్రంలోని వెళ్ళారా లేదా అని సమీక్షించుకోవడం జరిగిందని, జిల్లాలో ఎవరు సముద్రంలోని వెళ్లలేదని అందరు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పడం జరిగిందని తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గేవరకు, అధికారులు చెప్పేవరకు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లరాదని చెప్పడం జరిగిందన్నారు. సముద్ర తీర ప్రాంత మండలాల్లోని 18 గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్నీ ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఆప్రాంతంలోని వృద్దులు, గర్భిణీ స్త్రీల పై ప్రత్యేక దృష్టి సారించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టడం జరుగుచున్నదన్నారు. జిల్లా లో వున్న చెరువులు, రిజర్వాయర్స్ పరిస్థితిపై సమీక్షించుకోవడం జరిగిందని, ఎక్కడైతే ఓవర్ ప్లో అవుతున్న ట్యాంక్స్, చెరువులపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, విద్య, తదితర ముఖ్యమైన శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్షించి తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సంబంధిత శాఖల సిబ్బందితో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ గంట గంటకు సమాచారం తీసుకుంటూ ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా యంత్రాంగం మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్దంగా ఉందని తెలిపారు.
తొలుత మొంథా తుఫాన్ నేపధ్యంలో తుఫాన్ కు ముందు, తుఫన్ సమయంలో, తుఫాన్ తరువాత శాఖల వారీగా చేపట్టవలసిన చర్యలపై రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ప్రత్యేక అధికారికి సమగ్రంగా వివరించారు.
ఈ సమావేశంలో ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



