మొంథా తుఫాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమం నిమిత్తం ఒంగోలుకు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
