మొంథా తుఫాన్ నేపధ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
మొంథా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 3 రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
