వాతావరణ శాఖ మొంధా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ముందస్తుగా క్షేత్ర స్థాయి
అధికారులను అప్రమత్తం చేసే నిమిత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి కుమార్ మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజిత, వ్యవసాయాధికారి ప్రసాద రావు, మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య తదితరులు పాల్గొని చర్చించారు. మండలంలో రోడ్డు రహదారి మార్గాలలో వాగుల పరిస్థితి, చెరువుల పరిస్థితిపై చర్చించారు. తాళ్లూరు- విఠలాపుర౦ ల మధ్య ఉన్న దోర్నపు వాగు చప్టాను పరిశీలించారు. వాగు ప్రస్తుత పరిస్థితి వాగు పొంగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెవిన్యూ, పోలీన్ శాఖ అధికారులతో చర్చించారు. మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు. ఈనేపథ్యంలో తాళ్లూరులో గత ఐదు రోజుల నుండి తాగు నీరు రావటం లేదన్న సమాచారంతో ఆర్ డబ్యు ఎన్ ఎఈ వలి కి ఫోన్ చేసి సమావేశానికి ఎందు రాలేదని ప్రశ్నించారు. మండల కేంద్రానికి మంచి నీరు గత వారం రోజులుగా రావటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఎమి చేస్తున్నావు అని అడిగారు. సోమవారం ఉ దయం సమావేశానికి వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరారు.


