గుంటిగంగ బ్రాహ్మణ సత్రంలో కార్తీకమాస సత్యన్నారాయణ వ్రతాలు మండలంలోని గుంటిగంగ సన్నిధిలోని గుంటిగంగ బ్రాహ్మణ సత్రంలో కార్తీక మాసం సందర్భముగా ఆదివారం సత్రంలో సత్యన్నారాయణస్వామి వ్రతకార్యక్ర మం ఘనంగా జరిగింది. బ్రాహ్మణసత్రంఅధ్యక్షురాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి,
మండల బ్రాహ్మణ కమిటీ ఆద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాహ్మణ దంపతులుసామూహిక సత్యన్నారాయణ వత్రం చేపట్టారు ఐదేళ్లుగా కార్తికమాసం సందర్భంగా వేదపండితుల సారద్వర్యంలో సత్యన్నారాయణస్వామి వ్రతాలు నిర్వ హిస్తున్నారు. బ్రాహ్మణులు అధికసంఖ్యలోపాల్గొనివ్రతాన్ని తిలకించి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సత్రం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో వున్న దని, బ్రాహ్మణసంత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అధ్యక్షురాలు లక్ష్మీసుందరి తెలిపారు. శాశ్వత అన్నదానంకు దాతలు తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు. ఈ సందర్భముగా బ్రాహ్మణులు స సామూహిక వనభో జన కార్యక్రమం చేపట్టారు. సత్రం నందు సామూహిక మహాన్యాస పూర్వక రుద్రా భిషేకం, గోమాతపూజా కార్యక్రమాలు నిర్వహించారు. సత్రం కమిటీ ఆధ్వర్యంలో సత్రం అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స త్రం కమిటీ అధ్యక్షురాలు యల్లాప్రగడ లక్ష్మీ సుందరి,సత్రం కమిటీ బాధ్యులు వై.కన్నయ్య, ఆర్వై కోటేశ్వరరావు, నరసింహారావు,వెంకటేశ్వరి,తదితరులుపాల్గొన్నా రు. అన్నివర్గాల ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
