‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి కష్టాలు కలుగకుండా తగు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అన్నీ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశమై, ‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర తుపాను మారి ఈ రోజు మరియు 28, 29 వ తేదీ లలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి కష్టాలు కలుగకుండా తగు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు సముద్రం పైకి వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించచేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. శాఖలు వారిగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ల కు దిశానిర్దేశం చేసారు.
ఈ వర్చువల్ సమావేశానికి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

