ఏవోఏలు రికార్డుల నిర్వహణలో పూర్తి స్థాయి అవగాహన కల్గివుండాలి

పొదుపు మహిళా సంఘాలకు చెందిన రుణాల తాలూకు రికార్డుల నిర్వహణలో ఏవోఏలు పూర్తిస్థాయిలో అవగాహన కల్గివుండి రికార్డులు తయారు చేయాలని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో విఓఏల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా పీడీమాట్లాడుతూ …వివోఏలు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పొదుపు గ్రూపుల సమావేశాలు క్రమంత ప్పకుండా నిర్వహించాలన్నారు. గ్రూపు సభ్యులు రుణాలు బ్యాంక్ లో జమచేసున్నారా లేదా అన్నది ఎప్పటి కప్పుడు గమనిస్తూత ప్పులు జరుగకుండా చూడాల్సిన బాధ్యత వివోఏలదేనన్నారు. గ్రూపుల పురోగతి ఎలావుందో గుర్తించి గ్రూపులు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత నూతన యాప్ ద్వారా గ్రూపుల అన్ని స్థితిగతులను పరిశీలించి వాటి బలోపేతానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్త్రీనిధిరుణాలు, లోకోస్ యాఫ్ నిర్వహణ, ఐబీలోని వివిధరకాల వర్క్ లు , షేర్ప్ లో లోన్ లు, రికవరీలు, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ ఈల రికార్డుల నిర్వహణపై
వివరించారు. ఈకార్యక్రమంలో మండలసమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత, పైనాన్స్ డీపీఎం కృష్ణారావు, ఐబి ఏపీఎం ఆదిశేషు, ఏపీఎం దేవరాజ్, సీఆర్పీ లు,సీసీలుమోహన్,కోటేశ్వరరావు,అకౌంటెంట్ కుమారి, విఓఏలు, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *