సామాన్య విద్యార్థులతో కార్పోరేట్ స్థాయి ఫలితాలు సాధిస్తూ జిల్లాలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలు సంచలన ఫలితాలు వరుసగా సాధిస్తున్నాయని ఆ సంస్థ చైర్మన్ ఎవీ రమణా రెడ్డి తెలిపారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థ జెఈ మెయిన్స్‌లో వై రిషిత్ కుమార్ రెడ్డి 99.56 సాధించి టాప్ పర్సంటైల్‌లో నిలిచిన సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎవీ రమణా రెడ్డి మాట్లాడుతూ సరస్వతి విద్యా సంస్థలు ఒంగోలులో ఇంటర్మీడియట్ స్థాపించక ముందు విజయవాడ, గుంటూరు వంటి పట్టణాలలో కార్పోరేట్ విద్యా సంస్థలలో తల్లిదండ్రులకు తమ పిల్లలను చేర్పించి అధిక ఫీజులు చెల్లించి ఇబ్బందులు పడుతున్న సమయంలో తల్లిదండ్రుల ఆకాంక్షలను నేరవేర్చేందుకు తమ విద్యా సంస్థ ఇంటర్మీడియట్‌ను స్ధాపించినట్లు చెప్పారు. స్థాపించిన నాటి నుండి డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి లు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తి గత శ్రర్థతో ఉత్తమ ఫలితాలు సాధింస్తున్న తీరు విద్యార్థుల పట్ల తాము తీసుకుంటున్న ప్రత్యేక శ్రర్థకు నిదర్శమన్నారు. ముఖ్యంగా డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డిలు డీన్స్, ప్రిన్సిపాలన్ను కో ఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి విద్యార్ధి ప్రొగెన్పై ప్రత్యేక శ్రర్థ వహించటం వలననే మంచి రిజల్స్ సాధించినట్లు వివరించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యా సంస్థల యాజమాన్యాలను, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ప్రతిభ చాటివ జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో నిలిచిన వై రిషిత్ కుమార్ రెడ్డి (99.56) పర్సంటైల్, ఎం . వెంకట విష్ణు (98.26) పర్సంటైల్, ఎల్ వెంకటేశ్వర రెడ్డి (97.82) పర్సంటైల్, కె అవినాష్ రెడ్డి (97.37) పర్సంటైల్ లను అభినందించారు.
సంకల్పం, సిస్టమ్యాటిక్ ప్రిపరేషన్, స్మార్ట్ టెస్టింగ్ స్టాటజీలతో శ్రీ సరస్వతి ఆకాడమిక్ ప్రోగాం జరుగుతుందని అందుకు నిదర్శంన ఈ ఫలితాలు అని చెప్పారు. 90 పర్సంటైన్ పైన సాధించిన విద్యార్థులు 21 మంది, 85 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 47 మంది, 80 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు 77 మంది, జెఈఈ అడ్వాన్స్ -2026లో క్వాలిఫైకు అవకాశం ఉన్న విద్యార్థులు 165 మంది వరకు ఉన్నట్లు వివరించారు. విద్యార్థులు అందరికి ప్రత్యేక అభినందనలు చెప్పారు.
కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు ఎ గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, డీన్స్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.




