సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ,( జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక ఆండ్ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) ఆధ్వర్యంలో తమ డిమాండ్లను పరిష్కారించాలని శుక్రవారం గాంధీ ఆసుపత్రి వద్ద లంచ్ విరామ సమయంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించి,నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గాంధీ టీఎన్జీవో ప్రెసిడెంట్ గంట ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేసి 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, 13వ వేతన సవరణలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి (ఓపీఎస్) అమలు చేయాలని, 2004 సెప్టెంబర్ 1 తరువాత నియమితులైన ఉద్యోగులకు కూడా ఈ ప్రయోజనం కల్పించాలని కోరారు. గాంధీలో నిరసన తర్వాత టీఎన్జీవో నాయకులు అంతా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశారు.ఉద్యోగుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు సృష్టం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ర్ట మెడికల్ ఫోరం జనరల్ సెక్రటరీ ఎం. సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. గాంధీ టీఎన్‌జీవో యూనిట్ అధ్యక్షుడు గంట ప్రభాకర్ యాదవ్, కార్యదర్శి ప్రసన్న, కలీమ్, శ్రావణ్, సరళ, సత్యనారాయణ, జనార్ధన్, మక్సూద్, రహీమ్, శ్రీనివాస్,విశ్వనాథ్, బ్రహ్మం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
