బేగంపేట ఏప్రిల్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని కాంగ్రెస్కు మరింత బలాన్ని అందించాలని కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. శుక్రవారం తనను కలిసిన ప్రకాశం నగర్ యువజన కాంగ్రెస్ నూతన కమిటీకి బండి పై విధంగా సూచించారు. ఈ సందర్భంగా ప్రకాశం నగర్ యూత్ డివిజన్ కాంగ్రెస్ నేతలను బండి రమేష్ సన్మానించారు ప్రకాశం నగర్ యూత్ డివిజన్ అధ్యక్షుడుగా మోహిత్ బీసా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎండి యాసిన్, వైస్ ప్రెసిడెంట్ గా రాహుల్, ముజమిల్, జనరల్ సెక్రెటరీగా నితిన్ సెక్రటరీగా సమీర్లను ఎంపిక చేశారు. వీరంతా శుక్రవారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో బండి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సందర్భంగా డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిత్ బీసా మాట్లాడుతూ పెద్దలు సూచనలతో డివిజన్లో యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తానన్నారు అలాగే ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తిరిగి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం. జయం చంద్రశేఖర్, చిరంజీవి ,అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

