హైదరాబాద్ ఏప్రిల్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భానుడి భగభగలతో అల్లాడుతున్న బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ముందడుగు వేశారు. తిరుమలగిరి ట్రాఫిక్ విభాగం పరిధిలోని మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి చలివేంద్రాన్ని శుక్రవారం
ఏసీపీ జి. శంకర్ రాజు ప్రారంభించారు. ఎంవీ ఆటోమొబైల్స్, హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ సంస్థల సౌజన్యంతో సామాజిక బాధ్యతగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున పాదచారులు,వాహనదారులు, కూలీల సౌకర్యార్థం సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలకు సహకరించిన సంస్థల ప్రతినిధులను ఆయన అభినందించారు.కార్యక్రమంలో హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ అధినేత శ్రీహరి, ఎంవీ ఆటోమొబైల్స్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

