వాసవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం – రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ.

సికింద్రాబాద్, ఏప్రిల్ 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నమని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలియ జేశారు. శుక్రవారం సికింద్రాబాద్ ఆవులమందలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వాసవి అమ్మవారి జయంతి వేడుకలను ఈనెల 26వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల్లో అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆర్యవైశ్యులు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఆవులుమందులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్ నిర్మించారంటూ ఆలయ కమిటీ సభ్యులను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను ఆయన ప్రశంసించారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఆగిరి వెంకటేష్ దేవస్థానం కమిటీ అధ్యక్షుడు బాలేందర్ తమ్మి వెంకటేష్ ఉపేందర్ పాలూరి సురేష్ పిప్పల అశోక్ నార్ల దీపక్ తాడ వెంకటేష్ తేడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఆర్యవైశ్య పట్టణ మహాసభ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేయడాన్ని అమరవాది అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *