ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురష్కరించుకుని తాళ్లూరు టిడిపి యువ నాయకుడు యిడమకంటి శ్రీనివాస రెడ్డి జ్ఞాపకార్థం కిమ్స్, మోడరన్ ఐ హాస్పటల్ సౌజన్యంతో తాళ్లూరు ఎబీసీ ఉన్నత పాఠశాలలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు టిడిపి నాయకులు, వైద్యశిబిరం కార్య నిర్వాహకులు ఇడమకంటి సుబ్బా రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. శిబిరంలో కిమ్స్ ప్రత్యేక వైద్య బృందం జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రీహరి రెడ్డి, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ టివి రమణా రెడ్డి, ల్యాపరో స్కోపిక్ జనరల్ సర్జన్ పెరుమాళ్ల కార్తీక్ బాబు, మొదడు మరియు నరాల వైద్యనిపుణులు ఎం నిశ్చల్ రెడ్డి, స్త్రీలు మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఐవీ రెడ్డి, క్యాన్సర్ వైద్య నిపుణులు నారు రమణా రెడ్డి, వినయ్ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి, గౌతమి డెంటల్ వైద్యనిపుణులు డాక్టర్ తిరుమల రెడ్డి, మోడరన్ కంటి వైద్యనిపుణులు డాక్టర్ మారం వెంకట రమణా రెడ్డి, కిమ్స్ సీఓ కాకునూరి అంకి రెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు. తాళ్లూరు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వైద్యశిబిరం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
19 న తాళ్లూరు ఏబీసీ హైస్కూల్లో ఉచిత మెగా వైద్యశిబిరం
18
Apr