బేగంపేట ఏప్రిల్ 19
(జే ఎస్ డి ఎం న్యూస్ )
బేగంపేట ప్రకాశం నగర్లో ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. స్థానిక ఎవర్ గ్రీన్ ఫుడ్ కార్నర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే హోటల్ అంతటా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి.సమయస్ఫూర్తితో వ్యవహరించిన హోటల్ సిబ్బంది వెంటనే సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది హైడ్రా,సిబ్బంది,పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో అగ్నిమాపక యంత్రాలు చేరుకోవడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఆపగలిగారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

