బేగంపేట ,ఏప్రిల్ 22,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట అల్లం తోటబాయి సప్తగిరి టవర్స్ నుంచి వచ్చే నాలా రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచాలని, మయూరి మార్గ్ లో వివిధ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, గుంతలు పడిన రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయాలని కోరుతూ ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోయిన్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ కు వినతిపత్రం అందజేశారు. అల్లం తోట బాయి మయూరీ మార్గ్ లలో రోడ్లపై ఏర్పడిన గుంతలను ప్యాచ్ వర్క్ చేసి పూడిపించాలని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే బాలాజీ దాబా సమీపంలో పొంగుతున్న డ్రైనేజీ , ప్రకాశం నగర్ లో పొంగుతున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డీ సి కి విజ్ఞప్తి చేశారు. బీసీని కలిసిన వారిలో రమేష్ తో పాటు పద్మారెడ్డి, దర్గా కరుణాకర్, ఎరుకలు సురేష్, కొండ కిరణ్, చినబాబు ,శాంతికుమార్ తదితరులు ఉన్నారు.

