మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు సకాలంలో వేగంగా వైద్యం అందించిన జి జి హెచ్ వైద్య బృందాన్ని, సిబ్బందిని అభినందించినజిల్లా కలెక్టర్

   మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పూర్తి స్థాయిలో, సకాలంలో వేగంగా వైద్యం అందించిన జి జి హెచ్ వైద్య బృందాన్ని, సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాజాబాబు మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. వివిధ రకాల తీవ్రమైన గాయాలతో జి జి హెచ్ కు వచ్చిన వారిని క్యాజువాలిటీలో చేరిన నాటి నుంచి శ్రద్ధ వహించారని జిల్లా రెవిన్యూ అధికారి బి.చిన ఓబులేసు చెప్పారు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులు అందరూ డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో జి జి హెచ్ సూపరెంటెండెట్ ఛాంబర్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను డిఆర్ఓ వెల్లడించారు. 

      మార్చి నెల 26 జరిగిన మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన 17 మంది చికిత్స కోసం జి జి హెచ్ లో చేరారు. వీరందరికీ డాక్టర్లు వెంటనే స్పందించి  వైద్యం అందించారని, జిల్లా కలెక్టర్ రాజాబాబు మార్కాపురం బస్సు ప్రమాద ప్రాంతం నుంచి పర్యవేక్షించారని, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యక్షంగా వైద్యం అందుతున్న తీరును పరిశీలించారని అయన తెలిపారు. జి జి హెచ్ సూపరింటెండెంట్ తో పాటు ఆయా విభాగాధిపతులు, వైద్యులు, సిబ్బంది అందరూ శ్రద్ధతో వైద్యం చేసారని, ఒక్క మరణం కూడా లేకుండా వైద్యం అందించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. పేషెంట్ శ్రీహరిని మాత్రం

గుంటూరు జి జి హెచ్ కు రెఫెర్ చెయ్యగా అయన కూడా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఈ మేరకు నేడు జిల్లా కలెక్టర్ జి జి హెచ్ సూపరెంటెండెంట్ మరియు వైద్యులను పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు అని డి ఆర్ ఓ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
        ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో  ప్రజా ప్రతినిధుల చొరవను అభినందిస్తున్నాము. మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డా. ఉగ్ర నరసింహ రెడ్డి, ఇంటూరి నాగేశ్వర రావు, బి ఎన్ విజయ్ కుమార్, ఓ డా చైర్మన్ రియాజ్ క్షతగాత్రులను పరామర్శించి, వారికీ సత్వర వైద్య సేవలు అందించేందుకు తోడ్పడ్డారని తెలిపారు. అదే విధంగా  పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి  ప్రత్యేకంగా సూపరెంటెండెంట్ వారిని పిలిపించుకొని వైద్యం అందుతున్న తీరును తెలుసుకొని పలు మార్లు వారి గురించి వాకబు చేశారన్నారు. లివర్ గాయం, కాలికి ఫ్రాక్చర్ తో బాధపడుతున్న వారికి తొలి రోజే శస్త్ర చికిత్స అందిచామన్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా అందించినట్లు చెప్పారు. 

        సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ ఇలాంటి తీవ్రమైన కేసులను విజయవంతంగా పూర్తి చేసిన జి జి హెచ్ వైద్యులను, సిబ్బందిని, ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.  ఇది మా నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు. ఇలాంటి ట్రీట్మెంట్ కు ప్రైవేట్ వైద్యశాలలో 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు జిల్లా రెవిన్యూ అధికారి, జిల్లా వైద్య అధికారి నిరంతరం తమతో సంప్రదించి తోడ్పాటు అందించారు అని అన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్తులు ఎదురైనా వేగంగా స్పందించి వైద్యం అందించటం లో జి జి హెచ్ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది అని సూపరింటెండెంట్ తెలిపారు. 
      ఈ సమావేశంలో సి ఎస్ ఆర్ ఎమ్  మాధవి లత, అడ్మినిస్ట్రేటర్ అద్దెయ్య, డి ఎం హెచ్ ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *