రెండు మూడు రోజులలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట ఉత్పత్తిల భధ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. పలు చోట్ల వ్యవసాయ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కజొన్న, వరి, మిరప, నువ్వులు, ప్రత్తి అంతా ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయని కళ్లంలలో ఆరబోసి ఉన్నారని, అకాల వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, టార్పలిన్ పట్టలు కప్పెందుకు వీలుగా ఉండాలని కోరారు.
