ఓల్డ్ బోయిన్ పల్లి లో ఘనంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు………

ఓల్డ్ బోయిన్ పల్లి, మే 10,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయిన్పల్లి 262 వ డివిజన్ అస్మత్ పెట్ 264 వ డివిజన్ (119 డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసం మల్లికార్జున్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి దిగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అమ్మ లేనిదే సృష్టి లేదని అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ డివిజన్ పరిధిలోని సుమారు వందమందిమాతృమూర్తులకు తమ కొడుకులు పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా తన తల్లి ముద్దం లక్ష్మమ్మకు పాద పూజ నిర్వహించి ఆమె ఆశీర్వాదం తీసుకొన్నారు.అనంతరం మాట్లాడుతూ భగవంతుడు కూడా అమ్మ గర్భం నుంచే జన్మిస్తాడని అమ్మ అంటే ముక్కోటి దేవతలకు ఆరాధ్య దైవమని అన్నారు. తల్లి దండ్రుల తరువాతనే అందరూ అని ప్రతి ఒక్కరు తల్లి దండ్రులను మంచిగా చూసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతోనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులతో పాటు భార్యా సోదరీ సోదరీమణులను సంతోషంగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లో సీనియర్ మహిళలు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *