కంటోన్మెంట్ మే 10 (జే ఎస్ డి ఎం న్యూస్) :
మాతృమూర్తి ని మించిన దైవం లేదని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు.కంటోన్మెంట్ రెండో వార్డు అర్జున్ నగర్, అన్నానగర్ లో జ్యోతి రక్షా సమితి ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథి గా
టి ఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు.అనంతరం వారితో కేక్ కట్ చేయించి , శాలువా తో
సత్కరించారు.టి.ఎన్ మాట్లాడుతూ సృష్టి కి మూలం అమ్మ అని, అమ్మ ను ఈ ఒక్క రోజే కాకుండ బ్రతికి ఉన్నంత కాలం సేవ చేస్తే నే పుణ్యం అని
అన్నారు..కనిపించని
దేవుళ్ళ కన్నా ,కనిపించే అమ్మ, నాన్నల ను పూజించడమే మన జీవిత సోపానమని అన్నారు.ఈ కార్యక్రమంలో జ్యోతి, ఎల్లమ్మ, కనకవ్వ,మంజుల, ఇమ్మానియమ్మ, వెంకటమ్మ, పోచమ్మ తో పాటు స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు దేవుల పల్లి శ్రీనివాస్,
కుమార్,శ్యామ్,చంద్రం తదితరులు పాల్గొన్నారు.

