కంటోన్మెంట్ మే 10,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సృష్టికి మూలం అమ్మ అని కంటోన్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ అన్నారు.కంటోన్మెంట్ బోయిన్ పల్లి జయనగర్ కాలనీ లో
ఆయన నివాసం లో మాతృ దినోత్సవ వేడుకల లో భాగంగా తన మాతృ మూర్తి కి పాదాభివందనం చేసి ,ఆశీర్వాదం తీసుకుని , కేక్ కట్ చేయించి శాలువా
తో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని,అమ్మ లేనిదే సృష్టి లేదని అన్నారు. భగవంతుడు కూడ అమ్మ గర్భం నుంచే జన్మిస్తాడని అమ్మ అంటే ముక్కోటి దేవతలకు ఆరాధ్య దైవమని అన్నారు. తల్లి దండ్రుల తరువాతనే అందరూ అని ప్రతి ఒక్కరు తల్లి దండ్రులను మంచిగా చూసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతోనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులతో పాటు భార్య, సోదరీ సోదరీమణులను సంతోషంగా చూసుకోవాలని అన్నారు.

