బేగంపేట మే 10,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లో మద్యం షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రధాన రోడ్డు నుంచి శ్యామ్ లాల్ లోకి వెళ్లే రోడ్డు ప్రారంభంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న వైన్ షాపులతో మహిళలు ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మందుబాబులు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి రోడ్డుపైనే యదేచ్ఛగా మందేస్తూ ఉండటం మహిళలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతోపాటు సమీపంలో నివసిస్తున్న వారు సైతం బయటికి రావాలంటేనే జంకు తున్నారు. ఇదే విషయాన్ని స్థానికులు కొందరు బేగంపేట కమ్యూనిటీ పోలీస్ గ్రూపులో చర్యలు చేపట్టాలంటే ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతినిత్యం ఇదే విధమైన పరిస్థితులు ఉండటంతో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మద్యం మత్తులో తమ నివాసాల ముందు, రోడ్ల పైన ఎక్కడబడితే అక్కడ పడిపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
