గ్రామాల్లో దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికే గ్రామ సందర్శన ప్రభుత్వం చేపట్టినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. మల్కాపురం పంచాయితీ పరిధిలో గురువారం ఒక నెల ఒక గ్రామం నాలుగు దఫాల సందర్శనలో బాగంగా చేపట్టారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజల చెంతకే వచ్చి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇన్చార్జి తహసీల్దార్ జి ఫణీంధ్ర, ఎంఈఓ, గ్రామ ప్రత్యేక అధికారి జి నుబ్బయ్య, మండల నర్వేయర్ మహేష్ బాబు, మాజీ నర్పంచి ఖాశిం సైదా, విఆర్తో నాగూర్ బి, గ్రామ కార్యదర్శి శేషమ్మ, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజల నుండి సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించారు.
