శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా వినూత్న అడుగు.మీ ,సురక్ష, బృహత్తర కార్యక్రమం ప్రారంభం.నేటి నుంచి 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు.

బేగంపేట, మే 16,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా వినూత్న ఆలోచనకు సి పి బడుగుల సుమతి శ్రీకారం చుట్టారు. బేగంపేట ప్రకాశం నగర్ మహావీర్ ఫామ్ విల్లా అపార్ట్మెంట్ వద్ద మీ ,సురక్ష,అనే బృహత్తర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. నేటి నుంచి 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇళ్లలో పనిచేసే సిబ్బంది, వాచ్‌మెన్లు, డ్రైవర్ల వివరాల నమోదు తప్పనిసరి చేయాలన్నారు.డిజిటల్ పద్ధతిలో ‘హాక్‌ఐ ఆల్ట్రా’ (Hawkeye ULTRA) యాప్ ద్వారా డేటా సేకరణ చేయనున్నారు.శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కమిషనరేట్ పరిధిలో
ఈ వినూత్న అడుగుకు శ్రీకారం చుట్టారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతాలు, మారుతున్న నేరాల సరళిని అరికట్టేందుకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఒక వినూత్న ప్రజా రక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నివాస కాలనీలు, గేటెడ్
కమ్యూనిటీలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో మీ సురక్ష’ (MEE SURAKSHA) పేరిట ఇళ్లలో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు, ఇతర సిబ్బంది సమగ్ర వివరాల సేకరణ, ధృవీకరణ (ఎన్యూమరేషన్ & వెరిఫికేషన్) డ్రైవ్‌ను శనివారం (మే 16న) అధికారికంగా ప్రారంభించారు.
కమిషనరేట్ పరిధిలోని మొత్తం 28 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో ఒకేసారి
ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది.
550 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు.ఈ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న మొత్తం పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. దాదాపు 550 ప్రాంతాల్లోని నివాస కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, మధ్య, అల్ప ఆదాయ వర్గాల గృహ సముదాయాలలో ఏకకాలంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కాలనీ సంక్షేమ సంఘాలు (RWAs), అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, స్థానిక వాలంటీర్ల క్రియాశీలక భాగస్వామ్యంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది సెక్టార్ల
వారీగా ఈ తనిఖీలు చేపడుతున్నారు.
ఎవరెవరి వివరాలు సేకరిస్తారంటే..
నివాస గృహాలు, అపార్ట్‌మెంట్లలో వివిధ సేవలందిస్తున్న కింది సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తారు.
ఇంటి సహాయకులు (Domestic Helpers / Maids) వంటమనుషులు (Cooks / Servants)
వ్యక్తిగత, వాహన డ్రైవర్లు (Drivers)
వాచ్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులు (Watchmen / Security Guards)
తోటమాలి (Gardeners)
కేర్‌టేకర్‌లు (Caretakers)
పూర్తి డిజిటల్ విధానంలో నమోదుసేకరించిన సమాచారాన్ని పకడ్బందీగా భద్రపరిచేందుకు పూర్తి డిజిటల్ సాంకేతికతను వాడుతున్నారు. ‘హాక్‌ఐ ఆల్ట్రా’ (Hawkeye ULTRA) యాప్ ద్వారా మరియు గూగుల్ ఆధారిత ఆన్‌లైన్ సెల్ఫ్-రిజిస్ట్రేషన్ ఫారాల ద్వారా ఈ డేటాను డిజిటలైజ్ చేయనున్నారు. ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుండి
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా నేరుగా ఆన్‌లైన్ లింక్(https://forms.gle/stsHXNERcQY5WZ8k6) ద్వారా కూడా వివరాలు సమర్పించవచ్చని పోలీసులు తెలిపారు.
,మీ సురక్ష’ ప్రధాన లక్ష్యాలు
రక్షణ వలయం నగరంలో ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలు, పిల్లల భద్రతను మెరుగుపరచడం.
నేరాల నియంత్రణ ఆస్తి నష్టం కలిగించే నేరాలు, వ్యవస్థీకృత నేరాలను ముందుగానే అరికట్టడం.నేర పరిశోధన ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా పట్టుకునేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఖచ్చితమైన డేటాబేస్ రూపొందించడం.
పోలీస్-ప్రజా బంధం. అవగాహన సదస్సులు, కమ్యూనిటీ మీటింగ్‌ల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య సమన్వయాన్ని పెంచడం.
కమిషనర్ విజ్ఞప్తి
ఈ భద్రతా డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు. నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ల ప్రతినిధులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను నమోదు చేయించి, తమ కాలనీలను సురక్షితంగామార్చుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి శ్రీధర్ బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణమూర్తి,ఇన్స్పెక్టర్ సైదులు ,ఎస్సై లు శ్రీధర్ షఫీ,శ్రావణ్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *