నేడు ఒంగోలులో హనుమాన్ శోభాయాత్ర.— హిందూ బంధువులు కుటుంబ సమేతముగా శోభాయాత్రలో పాల్గొనాలి.— విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హనుమాన్ సేవా సమితి పిలుపు.

హనుమాన్ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు హనుమాన్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం వలెనే ఈ సంవత్సరం మే 17 అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటడానికి కనుల పండుగగా అత్యంత శోభాయమానంగా నగరంలోని రెండు ప్రదేశాల నుండి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాలతో… ఒంగోలు పురవీధుల్లో కాషాయ ధ్వజాల రెపరెపలతో… జైశ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో… హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా బజరంగ్దళ్ అధ్యక్షులు చిమ్మిరి బాలకృష్ణ, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క ప్రముఖ యినమనమెల్లూరి సీతారామయ్యలు తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యువకుల జయ జయ ధ్వనాలతో, మహిళల కోలాట నర్తనలతో, భజన బృందాల భజన గీతాలతో, చిన్నారుల స్కేటింగ్ తో రెండు వేలకు పైగా విచ్చేసే ద్విచక్ర వాహనాలపై యువతరం చేసే సందడితో భక్తియుతముగా హనుమాన్ శోభాయాత్ర ఒంగోలు నగర పురవీధులలో ఉత్సాహంగా సాగుతుందని తెలిపారు. సంతపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నెల్లూరు బస్టాండు ప్రకాశం భవనం మీదుగా మిరియాల పాలెం కూడలి వద్ద శివాలయం వద్ద నుండి వస్తున్న ర్యాలీని కలుపుకొని మరింత ఉత్తేజంగా బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్, కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ ప్రక్క నుండి మంగమూరు డొంక జంక్షన్, లాయర్ పేట చిట్టి ఆంజనేయ స్వామి గుడి, కోర్టు సెంటర్, చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద ఈ మహా హనుమాన్ శోభాయాత్ర ముగుస్తుందని వివరించారు.
సమావేశములో విశ్వహిందూ పరిషత్ వివిధ క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు, ప్రాంత టోలీ సభ్యులు సీతారామయ్య, అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జున రావు, కార్యదర్శి ఈమని బలరాము, కోశాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, గడ్డం శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీను వాసరావు, పసుమర్తి వెంకటేశ్వర్లు, పెరుమాళ్ళు, బజరంగ్దళ్ చిమ్మిరి బాలకృష్ణ, రామకృష్ణ, దనిశెట్టి రాము, హరిబాబు, పున్నారావు, బత్తుల శ్రీను, సింగోతు రాజేష్, మధు యాదవ్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *