ఆటలు ఆడేందుకు ట్రాన్స్ ఫార్మర్ పక్కగా గ్రౌండ్ లోకి వెళుతున్న చిన్నారులు…

పొంచి ఉన్న ప్రమాదం.
బేగంపేట మే 17,
(జే ఎస్ డి ఎం న్యూస్) : వేసవి సెలవలు కావడంతో చిన్నారులు ఆటలాడుకునేందుకు ప్రమాదకరంగా గ్రౌండ్ లోకి వెళుతున్నారు. ఎన్ బి టి నగర్ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న పార్కు కి చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రధాన గేటుకు తాళం వేశారు.దీంతో చిన్నారులు ప్రతి రోజు ఉదయం,సాయంత్రం గ్రౌండ్ లో ఆటలాడుకునేందుకు ప్రమాద కరంగా ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఫెన్సింగ్ కిందినుంచి అత్యంత ప్రమాదకరంగా గ్రౌండ్ లోకి చేరుకుంటున్నారు. ఈ విషయాన్ని తల్లి దండ్రులు గుర్తించడం లేదు.అసలే వేసవి కాలం కావడం తో ట్రాన్స్ ఫార్మర్లపై అధికంగా లోడు ఉంటుంది.పిల్లల్లు లోపలికి వెళ్ళే క్రమంలో పొరపాటున వారి చేతుల్లో ఉన్న ఏదైనా ఇనుప వస్తువులు కానీ,చేతులు కానీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఉన్న తీగలకు తగిలితే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో తలచు కుంటుంటేనే ఎంతో భయంగా ఉంది.వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు,జి హెచ్ ఎం సి అధికారులు,ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.చేతులు కాలాక ఆకులు పట్టు కోవడం కంటే ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అక్కడ తగిన భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *