మెగా జాబ్ మేళాను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్.

కంటోన్మెంట్, మే, (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజక వర్గంలోని మారేడ్ పల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆదివారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ జాబ్ మేళాలో మహేంద్ర, విప్రో, టెలీ కాన్ఫరెన్స్, హెల్త్ కేర్, ఐటీ, బీపీఓ తదితర 50 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఆత్మవిశ్వాసంతో తమ జీవితాలను తీర్చిద్దుకోవాలనిఆకాంక్షించారు. యువత కోసం ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంతోష్ యాదవ్ ను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.అనంతరం ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *