కంటోన్మెంట్ ,మే 17, (జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే మనందరి ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఆరోగ్య భరోసాను అందిస్తాయని, పేద ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నాయకులు సామాజిక బాధ్యతతో ఇటువంటి ప్రజోపయోగకర కార్యక్రమాలనునిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు .

