బేగంపేట ,మే 17, (జే ఎస్ డి ఎం న్యూస్) :
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ప్రతిభ చూపిన బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ,అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.కళాశాల విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ అప్పియ చిన్నమ్మ ,వైస్ ప్రిన్సిపాల్ టి.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.సుప్రియా పుంజాలఆధ్వర్యంలో వివిధ క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అధ్యాపకులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు.అధ్యాపకులు ప్రొఫెసర్ శారద ,ప్రొఫెసర్ శ్రీనివాస్ ,ప్రొఫెసర్ ఇలియట్ , ప్రొఫెసర్ అఫ్సర్ ఉన్నీసా బేగం, ప్రొఫెసర్ఎ మ్.పద్మకుమారి డా.కె.వెంకటేశ్వర్లు డా.డి.సరిత,డా.సునీత,డా.నందిని,డా.కల్పన,డా.పర్వీన్ సుల్తానా తదితరులు పాల్గొని విద్యార్థులనుఅభినందించారు.విద్యార్థులు,అధ్యాపకులు క్రీడావిభాగాధిపతి డా.సుప్రియా పుంజాలకి ఆత్మీయ సన్మానం చేశారు..కళాశాల FAC ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అప్పియా చిన్నమ్మ ప్రతిభ చూపిన విద్యార్ధులను,అధ్యాపకుల కృషిని అభినందించారు.

