దర్శి మండలం లోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలో అర్ధరాత్రి భారీ చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన తూము శ్రీనివాసరెడ్డి (నాగిరెడ్డి కుమారుడు) నివాసం లో గుర్తు తెలియని దొంగలు ఇంటి వెనుక వైపు తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో బీరువాలు, సామగ్రి వెతికి నగదు మరియు బంగారం దోచుకెల్లారు . ఇంట్లో ఉంచిన రూ.4 లక్షల 80 వేల నగదు, నాలుగున్నర సవర్ల బంగారం అపహరించుకుని వెళ్లినట్లు సమాచారం. ఇంటి ముందు గదిలో శ్రీనివాసరెడ్డి బార్య సుబ్బ లక్ష్మీ , ఇంటి పైన శ్రీనివాసరెడ్డి నిద్రించారు . ఉదయం నిద్రలేచి చూసే సరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, si మురళి, ci రామా రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు పరిశీలించారు . గ్రామంలో వరుసగా చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
