పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం మని దర్శి శాసనసభ్యులు డాక్టర్ పుత్ సభ్యులు శివప్రసాద్ అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపి రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పెట్రో ధరల మంట మండుతున్నాయని రాష్ట్రంపై పెట్రో భారం రూ.3,391 కోట్లు మోపారని చంద్రబాబు ‘మరో మోసం చేశారని చంద్రబాబు ప్రభుత్వం మరో ‘బాదుడే బాదుడు’ మొదలుపెట్టింది. సూపర్‌సిక్స్ తరహాలో మరో మోసంతో పచ్చి దగా చేస్తోందని కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, అన్నింటిలాగే ఆ విషయాన్ని కూడా గాలికొదిలేసిందని .
ఒకవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు లేవు. గత మా ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేయడమే కాకుండా, ఇప్పుడు ఈ తరహా పెట్రో బాదుడే బాదుడుతో వాహనదారులతో పాటు, ప్రజల నడ్డి విరుస్తోంది.
రాష్ట్రంలోనే అత్యధిక ధరలు ఉన్నాయని తాజా పెంపుతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్ రూ.113.62, లీటర్ డీజిల్ రూ.101.24కు చేరింది. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఎక్కువగా ఉండటంతో, దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. పెరిగిన ధరల వల్ల పెట్రోల్‌పై రోజూ రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లు అధిక భారం రాష్ట్రంలో వాహనదారులపై పడుతుంది.
అలా రాష్ట్ర ప్రజలపై నెలవారీ పెట్రోల్‌పై రూ.98.7 కోట్లు, డీజిల్‌పై రూ.180 కోట్ల చొప్పున భారం పడనుంది.
ఆ మేరకు ఏడాదికి పెట్రోల్‌పై రూ.1,201 కోట్లు, డీజిల్‌పై రూ.2,190 కోట్ల చొప్పున మొత్తంగా రూ.3,391 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించాల్సి ఉంటుంది.ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ మాటలు
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై రాష్ట్రం వేసే పన్నే అందుకు కారణం అని, టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తామని.. దానివల్ల రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి’అని ఎన్నికల ముందు చంద్రబాబు, నారా లోకేష్ ఊదరగొట్టారు.
ఇంకా ప్రజలను నమ్మించేందుకు మ్యానిఫెస్టోలో కూడా పెట్టి, ఇక్కడా మాట తప్పారు. ఇప్పుడు పన్ను తగ్గింపుల ఊసే ఎత్తడం లేదుఅన్నారు . ఇప్పుడు చంద్రబాబు నిస్సిగ్గు మాటలు మాట్లాడు తున్నారని
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి. తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్ డే గా పాటించాలి అని చంద్రబాబు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు.ఇదీ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి. ప్రజలను దగా చేసే విధానం.రాష్ట్రంలో వ్యాట్ వాత మన రాష్ట్రంలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 ఇంకా.. మరో ఒక్క రూపాయి రోడ్ డెవలప్మెంట్ సెస్‌గా వసూలు చేస్తున్నారు. అదే విధంగా లీటర్ డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 ఇంకా.. మరో రూపాయి రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద వసూలు చేస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అధికారంలోకి రాగానే, అవన్నీ తగ్గిస్తామని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అందుకని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి.
ఈ విషయంలో అంతా కలిసి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, ఇతర బాదుడు తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.





