సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోము – కలెక్టర్ పి.రాజాబాబు

‘ మీకోసం ‘ , స్పెషల్ గ్రీవెన్స్, పల్లె నిద్ర కార్యక్రమాలతో జిల్లా యంత్రాంగం ప్రజలకు చేరువవుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ” ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” ( మీకోసం ) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు సంతృప్తి చెందేలా సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏదైనా కారణంగా ఆ సమస్యను పరిష్కరించలేని పక్షంలో దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని ఆయన చెప్పారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. ‘ మీకోసం ‘ అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ మాధురి, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *