భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలురూపొందించాలి ..సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.

బేగంపేట, జులై 4,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భవిష్యత్అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన బేగంపేట డివిజన్ లోని ఓల్డ్ ఎయిర్ పోర్ట్
సమీపంలోని భగవంతాపూర్ రోడ్డులో 20 లక్షల రూపాయల వ్యయంతోచేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు,సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిష్కారం కోసం వివిధ అభివృద్ధి పనులుచేపడుతున్నట్లు తెలిపారు. రోజు రోజుకు జనాభా సంఖ్య, ఇండ్లు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. తద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుఏర్పడవని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్యనైనా త్వరితగతిన పరిష్కరించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులనుపట్టించుకోవడం లేదని
మండిపడ్డారు.
తమ ప్రభుత్వం లో ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా, ప్రజలకు సరిపడా త్రాగునీటి
ని అందించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ప్రజలు త్రాగునీరు, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, బోయిన్ పిల్లి సర్కిల్ వాటర్ వర్క్స్ జీ ఎం సునీల్, మేనేజర్ ఇందిర,
ఏ ఈ వరుణ్ దేవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, ఆరీఫ్, శ్యామ్, ప్రవీణ్, అడ్డు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *