శిక్షణతోనే మహిళలకు రక్షణ..ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్…గద్వాల విజయలక్ష్మి.

హైదరాబాద్ జులై 9(జే ఎస్ డి ఎం న్యూస్) :
శిక్షణతోనేమహిళలకు రక్షణ అని తెలంగాణా రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి అన్నారు.గురువారం వెంగళరావు నగర్ లోని రాష్ట్ర ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ సంస్థ భవనముల సముదయంలోని కాన్ఫరెన్స్ హాలులో మల్టీ జోన్ 2 అదిలాబాద్ ,నిజామాబాద్, కరీం నగర్,ఖమ్మం,వరంగల్ జిల్లాల సఖీ సెంటర్ల సిబ్బంది,పోలీస్,లీగల్ రెప్రజెంటేటివ్ లకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.జాతీయ మహిళా కమిషన్ , తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గద్వాల్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిక్షణా శిబిరానికి చేరుకున్న చైర్ పర్సన్ కి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా, కమిషన్ సభ్యులు, కార్యదర్శి, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ బాధింపబడే మహిళలు ఎప్పుడూ ఒంటరివారు కాదని వారికి అండగా మహిళా కమిషన్ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోనలుమూలలకు మహిళాకమిషన్ సేవలనుతీసుకెళ్తామని అన్నారు. ఓ పక్క సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ,మరో పక్క కమిషన్ లో నమోదవుతున్న ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్ పర్సన్ అన్నారు. శిక్షణతోనే రక్షణ వస్తుందని రక్షణతోనే కుటుంబం, సమాజం పరిరక్షణసాధ్యమవుతుందని అన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వారితో ఏర్పాటు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని బాధిత మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ గ, శశికళ యాదవ్ రెడ్డి , సదా లక్ష్మి , రాధాభాయ్, ఉజ్మా ఆషయ్ షాకీర్, కార్యదర్శి పద్మజ రమణ తో పాటు రిసోర్స్ పర్సన్స్ గా సైకాలాజిస్ట్ గీతా చల్లాతో పాటు, హైదరాబాద్ లా కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ పులిపాటి శ్రీదేవి, డిఎస్పీ సీతా రెడ్డి (ఉమెన్ సేఫ్టీ వింగ్ ), డి.ఎస్.ఎల్.ఏ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, కమిషన్ సిబ్బంది మరియు సంబంధిత జిల్లాల సఖి సెంటర్ల సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *