ప్రతి విద్యార్థి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం వైఎన్ ఆర్ కే ప్రసాద్ అన్నారు. తూర్పుగంగవరంలోని పీఎం శ్రీ ఎన్జీ ఎం జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డే నిర్వహించారు. ఓకేషనల్ ట్రైనర్ లు యరగొర్ల అంజిబాబు, సి హెచ్ దావీదు ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్ రంగ విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, రోల్ ప్లే, మై ట్రేడ్ మై డ్రీమ్ ఇతర ఇతర కాంపిటేషన్స్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందించారు. ఉపాధ్యాయులు పవన్ కుమార్, వై శ్రీనివాస రెడ్డి, జి శ్రీనివాస రెడ్డి, మేరీ మాధవి, శ్రీదేవి, ఆరోగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

