నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు – రీ సర్వే జరిగిన గ్రామాలలో ఎల్ పీఎంలు తొలగింపు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం – అకస్మికగా తనిఖీ నిర్వహించి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

రైతులు ఎదుర్కోంటున్న రీ సర్వే సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి హెచ్చరించారు. తాళ్లూరు మండలంలోని శివ రామపురం, దోసకాయల పాడు గ్రామాలలో రీ నర్వే అనంతరం అనేక మంది భూములు ఉమ్మడి భూ భాగాపు సంఖ్య (ఎల్ పీ ఎం)లో పడటంతో నూతన భూ హక్కు పుస్తకాలు పంపిణీకి అటంకాలు ఏర్పడ్డాయి. విషయం గమనించి జాయింట్ కలెక్టర్ శివ రామపురం, దోసకాయల పాడు నచివాలయాలను అకస్మికంగా మంగళవారం తనిఖీ నిర్వహించారు. శివరామపురంలో అధిక సంఖ్యలో ఎల్ పీఎంలు ఉండటం గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ విఆర్ ఓ
ప్రమోషన్ పై
ఇతర మండలానికి వెళ్లారని, ఇన్చార్జి ఇచ్చామని తహసీల్దార్ చెప్పారు. అనంతరం దోసకాయల పాడు నచివాలయం పరిశీంచి అక్కడ కూడ అదే పరిస్థితి కొనసాగటంపై తహసీల్దార్ రమణా రావు, మండల సర్వేయర్ మహేష్ ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో శివరామపురం ఇన్చార్జి విఆర్డిఓ నాగూర్ బి వచ్చి తనకు విఆర్ఓ ఇచ్చారు కాని, చార్జ్ అప్పగించ లేదని చెప్పారు. విధుల కేటాయింపులో నిర్లక్ష్యం తో ముందుకు సాగక పోక పోవటానికి గల కారణాలను విశ్లేషించిన జాయింట్ కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. శివరామపురం, దోనకాయలపాడులో అంగన్ వాడీ కేంద్రాలను పరిశీలించారు. దోసకాయల పాడు కరెంటు లేక పోవటం, కిటీకలకు డోర్ లేక పోవటం, ఎలుకలు తిరగటం ను గమనించారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి తక్షణమే విద్యుత్ ఇప్పించారు. అద్దంకి ఆర్ డీఓ విజయ జ్యోతి కుమారి, రెవిన్యూ సిబ్బంది, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *