నూపర్ ఎల్ నిలో ప్రభావంతో వాతావరణంలో మార్పుల పరిస్థితులలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రొత్సహించాలని డ్వామా ఎపీడీ రవి కుమార్ తెలిపారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో మంగళవారం పి బి జి రామ్ జి, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బందికి సమస్వయ సమావేశం డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డ్వామా ఎపీడీ రవి కుమార్ మాట్లాడుతూ రైతులు సంప్రదాయ పంటలు మాని ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపాలని కోరారు. ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల లోపు వారికి నూరు శాతం నబ్సిడీపై మొక్కల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. చౌడు నెలల్లో కూడ చింత, ఉసిరి, దానిమ్మ మరియు 19 రకాల పండ్ల, పూల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. ఎపీఎం వెంకటేశ్వర్లు, ఎఈఓ నుబ్బా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

