గురుపౌర్ణమి సందర్భంగాపలు ఆలయాలలో ఎమ్మెల్యే తలసాని పూజలు.

బేగంపేట జులై 29,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పలు ఆలయాలను దర్శించుకుని పూజలునిర్వహించారు. పద్మారావు నగర్ లోని
సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికారు. సాయిబాబా ను దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఫౌండర్ చైర్మన్ సాయి కుమార్ బాబా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు అంబులెన్స్ సురేష్, రమణ, మహేందర్ గౌడ్, ముక్కా శ్రీనివాస్, కుషాల్, శివ తదితరులు ఉన్నారు. అదేవిధంగా న్యూ బోయగూడ కమాన్ వద్ద గల సాయిబాబా ఆలయంలో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వాహకులు సన్మానించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీపతి, కుమార్ యాదవ్, ప్రేమ్, రాజేందర్, రంజిత్, సాయి ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, మహేష్, శ్రీను, రాము, పాండు, కరుణాకర్ తదితరులు ఉన్నారు.
పాలికా బజార్ లో గురు పౌర్ణమి ని పురస్కరించుకుని మోండా డివిజన్ లోని పాలికా బజార్ లో గల సాయిబాబా దేవాలయం లో బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మోండా డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందే నాగులు, కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, సత్యనారాయణ, అమర్, శ్రీనాధ్, జయరాజ్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావ్, సభ్యులు శంకర్ రావు, హన్మంతరావు యాదవ్, శ్రీనివాస్, జనార్దన్ యాదవ్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *