రాష్ట్రంలో అభి వృద్ధి , సంక్షేమ పాలన జరుగుతుందని దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దోసకాయలపాడు నుంచి తోటవెంగన్నపాలెంకు ని ర్మించిన బీటీరోడ్డును శనివారం ప్రారంభించారు. అనంతరం తోటవెంగన్నపాలెంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షే మానికి సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మండలంలో మొగిలిగుండాల రిజర్వాయర్, 133/32 కేవీ సబ్స్టేషన్, దోసకాలయ పాడు- తోటవెంగన్నపాలెం తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుచేశారన్నారు. అనంతరం అధికారం లోకి వచ్చిన వైసీపీ వీటిగురించి పట్టించుకోలేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే సంబంధిత అధి కారులతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తిచేసి నట్టు చెప్పారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజాప్ర భుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న సంక్షేమ పథకా లను అడిగి తెలుసుకున్నారు. తనకు భూమి లేకున్నా భూ మి ఉన్నట్లు చూపటంతో రెండేళ్లుగా
ఓమహిళ తనకు తల్లికి వందనం పడలేదన్నారు.
గ్రామ వెల్ఫేర్తో వెంటనే పరిష్కరించాలని డాక్టర్ లక్ష్మి సూచించారు. గత రెండేళ్ల ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
గ్రామంలో ఐటీసీ సహకారంతో రూ.లక్షలతో నిర్మిం చిన మంచినీటి ప్లాంట్ ను
డాక్టర్ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లలిత్ సాగర్,దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,
, పార్టీ మండల అధ్యక్షుడు మేడగం వెంక టేశ్వరరెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, బీసీ సంఘ నాయకుడు
పిన్నిక ర మేష్, సీనియర్ నాయకుడు మానం రమేష్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ రాచకొండ వెంకట్రా వు. మాజీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి జి.వేణుబాబు, సొసైటీ చైర్మన్ వి.సు బ్బయ్య,ఐ.సుబ్బారెడ్డి, కైపు రామకోటిరెడ్డి సత్యం, ప్రభాకర్ రెడ్డి, కాశీం. సైదా, క్లస్టర్ ఇంచార్జ్ కల్యాణ్ చక్రవర్తి , సుజాత, జనసేన మండల అధ్య క్షుడు కూటాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







